News » View Details

  •  

శాఖాహారం తో ఈ వ్యాధులు దూరం

Posted on 11th June, 2018 | Views : 168
శాఖాహారం తో ఈ వ్యాధులు దూరం
facebook twitter google plus linkedin pinterest mail

న్యూయార్క్‌: మనం తీసుకొనే ఆహారపు అలవాట్లపైనే ఆరోగ్యం ఆధారపడి ఉంది.శాకాహారం తినే వారికి గుండె సంబంధిత వ్యాధులు, డయాబెటీస్‌ వచ్చే అవకాశం తక్కువేనని దక్షిణాసియా వాసులపై జరిగిన ఓ అధ్యయనంలో తేలింది. శాకాహారం తీసుకునే వారిలో లోయర్‌ బాడీ మాస్‌ ఇండెక్స్‌(బీఎంఐ) ఉన్నట్లు పరిశోధకుల్లో ఒకరైన భారత సంతతికి చెందిన వ్యక్తి తెలిపారు. మాంసం తినే వారితో పోలిస్తే శాకాహారుల్లో నడుము చట్టుకొలత చిన్నగా ఉన్నట్లు, పొట్టలో కొవ్వు తక్కువగా ఉన్నట్లు,  తక్కువ కొలెస్టరాల్‌, బ్లడ్‌ షుగర్‌ ఉన్నట్లు తేలింది. ఈ వివరాలను బోస్టన్‌లో జరిగిన న్యూట్రిషన్‌-2018 సమావేశంలో పరిశోధకులు వెల్లడించారు.సరాసరి 55 ఏళ్ల వసున్న 892 మంది దక్షిణాసియా వాసులను పరిశోధించి ఈ వివరాలు వెల్లడిస్తున్నట్లు తెలిపారు.అలాగే శాకాహారం తీసుకునే పురుషుల్లో కరోనరీ ఆర్టరీ కాల్షియం అభివృద్ధి తక్కువగా ఉన్నట్లు తేలింది. శాఖాహారం గుండెకు రక్షణ ఇస్తుందా లేదా అని నిర్ణయించడానికి మరిన్ని అధ్యయనాలు అవసరమని బృందం పేర్కొంది.

Also View

  •