News » View Details

  •  

UEJA 3వ వార్షికోత్సవ జర్నలిస్టుల ఆత్మీయ అభినందన సభ..

Posted on 23rd February, 2017 | Views : 528
UEJA 3వ వార్షికోత్సవ జర్నలిస్టుల ఆత్మీయ అభినందన సభ..
facebook twitter google plus linkedin pinterest mail

విజయనగరం: ఉత్తరాంధ్ర ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు వెల్ఫేర్ అసోసియేషన్ (UEJA) త్రుతీయ వార్షికోత్సవం సందర్భంగా జర్నలిస్టులకు ఆత్మీయ అభినందన సభను విజయనగరంలోని ఐఎంఎ హాలులో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా UEJA డైరీ ఆవిష్కరణతో పాటు గత నెల 21న కొమరాడ మండలం కూనేరు రైల్వే స్టేషన్ వద్ద జరిగిన హిరాఖండ్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాద ఘటన వార్తను వ్యయ ప్రయాసాలకు ఓర్చి సకాలంలో ప్రపంచానికి అందించిన పార్వతీపురం డివిజన్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు జ్ఝాపికలతో అభినందించడం జరిగింది. కార్యక్రమానికి జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ డా.శోభా స్వాతిరాణి ముఖ్యఅతిథిగా హాజరుకాగా, ఎమ్మెల్పీ ద్వారపురెడ్డి జగదీష్, వాజి కేబుల్ ఎండి జి.శ్రీనివాసరావు, మహరాజా ఆసుపత్రి అభివ్రద్ధి కమిటీ ఛైర్మన్ డాక్టర్ వి.ఎస్.ప్రసాద్ లు హాజరై, జర్నలిస్టులను అభినందించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ మున్ముందు మంచి కార్యక్రమాలను చేపట్టాలని కోరుతూ ఎమ్మెల్సీ జగదీష్ అసోసియేషన్ కు 10వేల రూపాయల విరాళాన్ని అందజేశారు. కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా, కార్యక్రమానికి అవసరమైన సహాయ, సహకారాల్ని అందజేసిన జెడ్పీ చైర్ పర్సన్ స్వాతిరాణి, వాజి ఎండి శ్రీనివాసరావు, డాక్టర్ ప్రసాద్ లకు అసోసియేషన్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Also View

  •