News » View Details

  •  

మూడు ప్రపంచ రికార్డు లను సాధించిన విశాఖ వైద్యులు డా.వై.శివ నాగేంద్ర రెడ్డి కి రికార్డుల ప్రధానం

Posted on 23rd December, 2016 | Views : 879
మూడు ప్రపంచ రికార్డు లను సాధించిన విశాఖ వైద్యులు డా.వై.శివ నాగేంద్ర రెడ్డి కి రికార్డుల ప్రధానం
facebook twitter google plus linkedin pinterest mail

న్యూస్ ఫర్ అజ్:విశాఖపట్నం: 116 గ్రహణం మొర్రి సర్జరీలకు సహకారం అందించిన తానా...గతంలో 500 సర్జరీలకు సహకారం..
స్మైల్ కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుర్గా హాస్పటల్ లో తానా (తెలుగు అసోషియేషన్ ఆఫ్
నార్త్ అమెరికా) వారి సౌజన్యంతో గత 6 సంవత్సరాలుగా 500 గ్రహణం మొర్రి సర్జరీలను
ఈ ఏడు 116 సర్జరీలను చేయడం జరిగింది.మరియు భారత్ వరల్డ్ రికార్డ్ ,జీనియస్ బుక్
ఆఫ్ రికార్డ్ ,వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మూడు ప్రపంచ రికార్డులను 10 సంవత్సరాలలో
6300 గ్రహణం మొర్రి సర్జరీలు,28 గంటలలో నాన్ స్టాప్ గా 32 సర్జరీలకు మరియు 9
మంది అంతర్జాతీయ నిష్ణాతులైన వైద్యులకు ట్రైనింగ్ ఇచ్చినందుకు గాను సీనియర్
మేక్సిలో ఫేసియల్ సర్జన్ డా.వై.శివ నాగేంద్ర రెడ్డి మూడు ప్రపంచ రికార్డులను
సాధించగలిగారు.ఈ రోజు తానా అధ్యక్షులు జంపాల చౌదరి,జై తాళ్లూరి,తానా ఫౌండేషన్
చైర్మన్ శ్రీనివాస గోగినేని ప్రముఖులు,రికార్డ్ ప్రతినిధులు జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్
ఇండియా చీఫ్ బింగి నరేంద్ర గౌడ్,వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఏపి & తెలంగాణ చీఫ్
డా.గుర్రం స్వర్ణశ్రీ మరియు భారత్ వరల్డ్ రికార్డ్స్ ఏపి & తెలంగాణ చీఫ్ బి.యం.శివ
ప్రసాద్ లు మూడు ప్రపంచ రికార్డ్ లను వైద్యులు శివ నాగేంద్ర రెడ్డికి ఇవ్వడం జరిగింది.
ఊర్వశి హైవే జంక్షన్ దుర్గా హాస్పటల్ నందు ప్రధానం చేయడమైంది...ఈ సందర్భంగా
వైద్యులు శివ నాగేంద్ర రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రపంచ రికార్డ్ లను కైవసం చేసుకోవడం
చాలా సంతోషంగా ఉందని ఇవి చూసి నప్పుడల్లా తమ భాద్యతను గుర్తు చేస్తాయని,నా
ఊపిరున్నంత వరకు ఇలాంటి సర్జరీలను అలుపెరగ కుండా చేసేందుకు సిద్ధంగా
ఉన్నానని ఆయన అన్నారు.నిస్సహాయంగా ఉన్న పేద చిన్నారులకు గ్రహణం మొర్రి
బారి నుంచి చిరునవ్వును అందించి బంగారు భవితవ్యాన్ని ఇచ్చేలా నా వంతు
ప్రయత్నిస్తున్నానని శివ నాగేంద్ర రెడ్డి తెలిపారు.

 

Also View

  •