News » View Details

  •  

డాక్టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులకు ఆహ్వానం

Posted on 10th December, 2016 | Views : 261
డాక్టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులకు ఆహ్వానం
facebook twitter google plus linkedin pinterest mail whatsapp

న్యూస్ ఫర్ అజ్ : వనపర్తి జిల్లా కేంద్రంలోని సీమంక్ సెంటర్లో పని చేయుటకు గైనకాలజిస్ట్,ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో 4 డాక్టర్ పోస్టులను భర్తీ చేసేందుకు అర్హులైన వారి నుండి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ అధికారి ఓక ప్రకటనలో తెలిపారు.ఈ నెల 15వ తేది వరకు దరఖాస్తులు చేసుకోవాలని ఆయన తెలిపారు.గైనకాలజిస్ట్ పోస్టుకు ఎం బి బి ఎస్,ఎం ఎస్ లేదా ఎండి అర్హత కలిగి ఉండాలని,డాక్టర్ పోస్టులకు ఎం బి బి ఎస్ పాస్ఐ ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాల్లో మెడికల్ రిజిస్ట్రేషన్ అయి ఉండాలని 18 నుండి44 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలని సూచించారు.రూ.500డీడీని డి ఎం& హెచ్ఓ పేర తీసి ఉండాలని తెలిపారు.ఎస్సి,ఎస్టీ ,బీసీ లకు 5సంవత్సరాలు,వికలాంగులకు 10 సంవత్సరాల సడలింపు వర్తిస్తుందని తెలిపారు.వనపర్తి ఢీయం&హెచ్ఓ కార్యాలయంలో దరఖాస్తులను సమర్పించాలని తెలిపారు.