News » View Details

  •  

పాత 500 నోట్లు 21 చోట్ల వాడుకోవచ్చు...

Posted on 25th November, 2016 | Views : 869
పాత 500 నోట్లు 21 చోట్ల వాడుకోవచ్చు...
facebook twitter google plus linkedin pinterest mail

న్యూస్ ఫర్ అజ్ : పాత 1000 నోటుకు కాలం చెల్లినా, 500 నోటును పరిమిత అవసరాల కోసం వాడుకునే వెసులుబాటు డిసెంబర్ 15 వరకూ కొనసాగనుంది. పాత 500 నోట్లను ఎక్కడెక్కెక్కడ వాడుకోవచ్చో ఓసారి చూద్దాం.
1. ప్రభుత్వ ఆసుపత్రులు, ఫార్మసీలు. డాక్టర్ల ప్రిస్కిప్షన్ తప్పనిసరి.
2. అన్ని ఫార్మసీలలో చెల్లింపులు జరపచ్చు. అయితే డాక్టర్ల ప్రిస్పిప్షన్, ఐడి ఫాం తప్పనిసరి.
3. రైల్వే టికెటింగ్ కౌంటర్లు, ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే బస్సులకు చెందిన టిక్కెట్ కౌంటర్లు, విమానాశ్రయాల టెకెట్ కౌంటర్లలో పాత 500 నోటు చెల్లుబాటవుతుంది.
4. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాల బూత్‌లు.
5. ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు నడిపే స్టేషన్లలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొనుగోలు చేయవచ్చు.
6. క్రిమిటోరియం, స్మశాన వాటికలు.
7.అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఎరైవింగ్, డిపార్టింగ్ ప్యాసింజర్లు పాత 500 నోట్లను వినియోగించుకోవచ్చు.
8. విదేశీ టూరిస్టులు కరెన్సీని ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు.
9. కన్స్యూమర్ కోఆపరేటివ్ స్టోర్స్‌లో కొనుగోళ్లు.
10. రైలు ప్రయాణాల్లో కేటరింగ్ సర్వీస్ పేమెంట్లు.
11. వంట గ్యాస్ సిలెండర్ల కొనుగోలు.
12. సబర్బన్, మెట్రో రైల్ సర్వీసుల్లో టిక్కెట్ల కొనుగోలు.
13. భారత పురావస్తు శాఖ ఆధ్వర్యంలోని పురాతన కట్టడాల సందర్శన (ఎంట్రీ) టెక్కెట్ల కోసం పాత 500 నోటు వినియోగించుకోవచ్చు.
14. కేంద్ర, రాష్ట్ర, మున్సిపల్, స్థానిక సంస్థలకు చెల్లించే ఫీజులు, చార్జీలు, పన్నులు, పెనాల్టీలు.
15. విద్యుత్, నీటి బిల్లుల చెల్లింపులు. ఎరియర్స్, కరెంట్ చార్జీలకు మాత్రమే పాతనోట్లుతో చెల్లించే వెసుసుబాటు ఉంది. అడ్వాన్స్ పేమెంట్లు కుదరవు.
16. కోర్టు ఫీజులు.
17. గుర్తింపుపొందిన కేంద్రాల్లో విత్తనాల కొనుగోళ్లకు పాత 500 నోట్లను తీసుకుంటారు.
18. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాఠశాలల్లో ఒక్కో విద్యార్థి స్కూలు ఫీజు కింద రూ.2000 వరకూ చెల్లించే వెసులుబాటు.
19. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కాలేజీల్లో ఫీజులు.
20. ప్రీపెయిడ్ మొబైల్ సిమ్‌ టాప్ అప్‌. రూ.500 రీచార్జ్‌ చేసుకోవాలి.
21. రూ.5000 వరకూ కన్యూమర్ కో-ఆపరేటివ్ స్టోర్స్‌ నుంచి కొనుగోళ్లు చేసుకోవచ్చు

 

Also View

  •