News » View Details

  •  

వాల్తేర్ డివిజినల్ రైల్వే విజిలెన్స్ వారోత్సవాలు....

Posted on 03rd November, 2016 | Views : 327
వాల్తేర్ డివిజినల్ రైల్వే విజిలెన్స్ వారోత్సవాలు....
facebook twitter google plus linkedin pinterest mail whatsapp

న్యూస్ ఫర్ అజ్  :విశాఖపట్నం : సర్ధార్ వల్లభాయి పటేల్ పుట్టిన రోజు సందర్బాన ప్రతీ సంవత్సరం వాల్తేర్ డివిజన్ రైల్వే అధికారులు నిర్వహించే విజిలెన్స్ వారోత్సవాలను ఎప్పటి లానే ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేశారు. అవినీతి నిర్మూలనలో రైల్వే అధికారులు పోరాడి ప్రజలకు మంచి నాణ్యమైన సేవలు అందించేలా కృషి చేయాలని డివిజినల్ రైల్వే మేనేజర్ చంద్రలేఖ ముఖర్జీ విజిలెన్స్ వారోత్సవాలలో బాగంగా ఏర్పాటు చేసిన సెమినార్ సమావేశంలో అన్నారు.అక్టోబర్ 31 వ తేదిన యూనిటీ రన్ తో ప్రారంభించిన విజిలెన్స్ వారోత్సవాల్లో ప్రతీ రోజు ఆమె వివిధ కార్యక్రమాలలో సుమారు 120 మంది డిపార్టమెంట్ ఉద్యోగులతో అవగాహన సదస్సులలో పాల్గొంటున్నారు.ఈ నెల 5 వ తారీకు వరకు జరిగే సమావేశాల్లో డిపార్టమెంట్లో అన్ని విభాగాలలో పూర్తీ స్ధాయి అవగాహన కలిగించేలా ఈ  సమావేశాలు ఉండబోతాయని ఆమె అన్నారు.సీనియర్ డి సియం అధికారి యల్వెంధర్ యాదవ్ సమక్షం లో ఈ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి......

Also View

  •