News » View Details

  •  

ఆంద్ర మెడికల్ కాలేజ్ న్యూరో సర్జరీ విభాగ డైమండ్ జూబ్లీ సంభరాలు

Posted on 23rd October, 2016 | Views : 286
ఆంద్ర మెడికల్ కాలేజ్ న్యూరో సర్జరీ విభాగ డైమండ్ జూబ్లీ సంభరాలు
facebook twitter google plus linkedin pinterest mail whatsapp

న్యూస్ ఫర్ అజ్: ఆంధ్ర మెడికల్ కాలేజి న్యూరో సర్జరీ విభాగం ప్రారంభమై 60 ఏళ్ళు గడిచిన సందర్బాన డైమండ్ జూబ్లీ సంబరాలను విశాఖలో హోటల్ గ్రీన్ పార్క్ లో ఘనంగా జరుపుకున్నారు. 1956 న్యూరో సర్జరీ విభాగం ను ప్రారంభించిన నాటి ఆంద్ర రాష్టానికే మొదటి న్యూరో సర్జన్ వైద్యులు ఎస్.బాలపరమేశ్వరరావు ఇప్పుడు 60 ఏళ్ల తరువాత తిరిగి డైమండ్ జూబ్లీ సంబరాలలో పాల్గొనటం విశేషం. తరువాత న్యూరో సర్జరీ విభాగాదిపతులుగా విధులు నిర్వర్తించిన వైద్యులు కే.వి.చలపతిరావు, ఐ.దినకర్ ,రాజేంద్రప్రసాద్,బి.సుబ్బారావు ఎన్.సుబ్రహ్మణ్యం,కె.విష్ణు ప్రసాద్ లు ఉన్నప్పుడు 40 పడకలతో ఆసుపత్రి సేవలను అందించారు.వారందరిలో వైద్యులు రాజేంద్రప్రసాద్ మృతి చెందగా మిగిలిన విభాగాదిపతులుగా వ్యవహరించిన నాటి వైద్యులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని ఒకే వేదికపై ఒకసారి స్వీట్ మేమోరిస్ ను తలచుకున్నారు. ప్రస్తుతం న్యూరో సర్జరీ విభాగాధిపతిగా వ్యవహరిస్తున్న వైద్యులు కె.సత్యవరప్రసాద్ ఆద్వర్యంలో గతంలో ఉన్న 40 పడకలను 120 పడకలుగా ,ఐ సియులు,3 ఆపరేషన్ థియేటర్లు,రోగులకు వారానికి 6 రోజుల సేవలతో అత్యాధునిక వైద్య పరికరాలతో 24 గంటల రౌండ్ ద క్లాక్ సేవలందుతున్నాయి.ఆంద్ర మెడికల్ కాలేజిలో మాత్రమే ఎం.సి.ఐ అనుభందంగా న్యూరో సర్జరీ పిజి కోర్స్ సూపర్ స్పెషాలిటితో నడుస్తుంది. కేవలం ఉత్తరాంధ్ర జిల్లాలకే కాక ఒడిస్సా ఛత్తీస్ఘడ్ రాష్ట్రాల ప్రజలకు నిర్విరామ సేవలందిస్తుంది...అయితే ఇంత నిష్ణాతులైన వైద్యులను కలిగిఉన్న కేజిహెచ్,ఎఎంసి మరో అదనపు న్యూరో సర్జరీ యూనిట్లను పెంచి ఏర్పాటు చేయాల్సిన భాద్యత ప్రభుత్వానికి ఎంతైనా ఉంది..

 

Also View

  •