News » View Details

  •  

ఏపీలో డిజిటల్ క్లాస్ రూమ్ లు రూపుదిద్దుకోనున్నాయి

Posted on 19th October, 2016 | Views : 238
ఏపీలో డిజిటల్ క్లాస్ రూమ్ లు రూపుదిద్దుకోనున్నాయి
facebook twitter google plus linkedin pinterest mail whatsapp

న్యూస్ ఫర్ అజ్ :విశాఖ : ఏపీలో డిజిటల్ క్లాస్ రూమ్ లు రూపుదిద్దుకోనున్నాయి...రాష్ట్ర వ్యాప్తంగా అత్యాధుకిన సాంకేతిక పరిజ్నానంతో కూడిన 1280 తరగతి గదులను విశాఖ నుంచి సిఎం చంద్రబాబు ప్రారంభిస్తున్నట్లు ఏపీ విధ్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస్ రావు విశాఖలో ప్రకటించారు...ఎన్.ఆర్.ఐల సహకారంతో డిజిటల్ క్లాస్ రూంలను సాకారం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది...సిఎం చంద్రబాబు సూచనల మేరకూ మొదటి నుంచి డిజిటల్ క్లాస్ రూమ్ ల విషయంలో ప్రత్యేకించి చర్యలు తీసుకుంటున్నామని చేప్తున్న ప్రభుత్వం అందుకు తగ్గట్టుగా ప్రతిపాదనలను వేగవంతం చేసింది...ఈ క్రమంలో రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1280 క్లాస్ రూమ్ లను ప్రారంభించాలని ప్రభుత్వం మోచిస్తోంది...సాంకేతిక పరిజ్నానం విషయంలో సరికొత్త పద్దతులను అనుసరిస్తున్నామని చేప్పిన గంటా ... డిజిటల్ క్లాస్ రూమ్ లకు అవసరమయ్యే నిధుల్లో 70 శాతం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించగా మిగిలిన 30 శాతాన్ని ఎన్.ఆర్.ఐల సహకారం అందిస్తున్నట్లు చేప్పారు...ఇదే కాకుండా అంకిత భావంతో పని చేస్తున్న ఉపాధ్యాయులకు ప్రత్యేకించి శిక్షణ ఇచ్చి మెరుగైన విధ్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్నీ విధాలుగా కృషి చేస్తుందని మంత్రి గంటా శ్రీనివాస్ రావు తెలిపారు..

Also View

  •