News » View Details

  •  

సర్జికల్ స్ట్రైక్స్ పై డిమాండ్లను పట్టించుకోం...వెంకయ్య నాయుడు

Posted on 05th October, 2016 | Views : 199
సర్జికల్ స్ట్రైక్స్ పై  డిమాండ్లను పట్టించుకోం...వెంకయ్య నాయుడు
facebook twitter google plus linkedin pinterest mail whatsapp

న్యూస్ ఫర్ అజ్: న్యూఢిల్లీ : సర్జికల్ స్ట్రైక్స్ వీడియోలను విడుదల చేయాలన్న, ఆప్‌, కాంగ్రెస్‌ నేతల వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... భారతదేశం ఎవరితోనూ యుద్ధాన్ని, ఘర్షణను ఎప్పటికీ కోరుకోదన్నారు. అయితే... ఎవరైనా రెచ్చగొడితే మాత్రం గట్టి సమాధానం చెబుతామన్నారు. అలాగే ఇతరులను పదే పదే విసిగించేందుకు కొంతమంది ఉంటారని, వాళ్లను మేం నిశ్శబ్దంగానే డీల్ చేస్తామన్నారు. మన ఆర్మీ కూడా నిశ్శబ్దంగానే సర్జికల్ స్ట్రైక్స్ చేసిందన్నారు. అలాగే ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ పార్టీల నాయకుల డిమాండ్లను ప్రస్తావిస్తూ... అలాంటివాళ్లు చేసే బాధ్యతారహితమైన వ్యాఖ్యలకు, డిమాండ్లకు స్పందించాల్సిన అవసరం లేదని తెలిపారు. దేశంలోని మరే ఇతర పౌరుడికి భారత సైన్యం నిబద్ధత మీద అనుమానాలు ఉండి ఉంటాయని తాను అనుకోవడం లేదన్నారు.

Also View

  •