Archive » News » View Details

  •  

ఆబ్కారీ దాడులు

Posted on 28th November, 2016 | Views : 327
ఆబ్కారీ దాడులు
facebook twitter google plus linkedin pinterest mail whatsapp


న్యూస్ ఫర్ అజ్ : వనపర్తి మండల పరిధిలోని కొన్ని ప్రాంతాలలో ఆబ్కారీ జిల్లా అధికారి నవీన్ కుమార్ దాడులు నిర్వహించారు. మండల పరిధిలోని రాజపేట తండా,నాగవరం తండా,వనపర్తి పట్టణంలోని నాటుసారా తయారీ కేంద్రాలపై,విక్రయ కేంద్రాలపై దాడులు నిర్వహించి 200 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసి,10లీటర్ల నాటుసారా బాటిళ్ళనూ స్వాధీనం చేసుకున్నారు. పట్టణం లోని బండారు నగర్లో సారా వీక్రేత దొడ్ల రంగమ్మను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకుని వనపర్తి ఆబ్కారీ స్టేషన్లో ఉంచారు.చిట్యాలకు చెందిన సోని అనె వీక్రేత పరారీలో ఉన్నదని.. ఆమెపై కూడా కేసు నమోదు చేసినట్లు ఆబ్కారీ పోలీసులు తెలిపారు.ఈ దాడుల్లో టాస్క్ఫోర్స్ సీఐ శివజ్యోతి,హెడ్ కానిస్టేబుల్ భాఘవంతు గౌడ్,ధనరాజ్ గౌడ్,కానిస్టేబుల్స్ అఖిల్,లక్ష్మణ్ పాల్గొన్నారు.