Archive » News » View Details

  •  

ఇండోర్-పాట్నా రైలు ప్రమాదాన్ని సంపాదనగా మలచుకోవాలనే దుర్బుద్ధి తో ఓ మహిళ పట్టుబడింది

Posted on 23rd November, 2016 | Views : 128
ఇండోర్-పాట్నా రైలు ప్రమాదాన్ని సంపాదనగా మలచుకోవాలనే దుర్బుద్ధి తో ఓ మహిళ పట్టుబడింది
facebook twitter google plus linkedin pinterest mail whatsapp

న్యూస్ ఫర్ అజ్ : ఇండోర్-పాట్నా రైలు ప్రమాదాన్ని సంపాదనకు ఆయుధంగా మలచుకోవాలని శవంపై డబ్బులేరుకునే మహిళ ప్రయత్నించి పట్టుబడిన ఘటన బీహార్ లో చోటుచేసుకుంది. డీఎస్పీ పవిత్ర మోహన్ త్రిపాఠి చెప్పిన వివరాల్లోకి వెళ్తే...పాట్నా ప్రాంతానికి చెందిన ప్రీతి అనే మహిళ మాటి పోస్టు మార్టం హౌస్ కు వచ్చింది. రైలు ప్రమాదంలో మరణించిన వ్యక్తులను గుర్తించే క్రమంలో ఓ మృతదేహాన్ని తన సోదరుడు రాహుల్ అంటూ తెగ కన్నీరు పెట్టుకుంది. పోస్టుమార్టం చేసిన ఆ మృతదేహాన్ని అక్కడి నుంచి తీసుకెళ్లేందుకు ప్రయత్నించింది. అయితే డెడ్ బాడీని తీసుకెళ్లే క్రమంలో ఆమె పదేపదే నష్టపరిహారం ఎప్పుడొస్తుందంటూ పలువుర్ని ప్రశ్నించింది. 

ఈ క్రమంలో డాక్టర్లను కూడా అడిగింది. దీంతో అనుమానం వచ్చిన వైద్యులు పోలీసులకు తెలిపారు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆమెను అడ్రస్ ప్రూఫ్ అడిగారు. దీంతో ఆమె తన ఐడెంటిటీ ఇవ్వకుండా విభిన్న ప్రాంత అడ్రస్ లు ఇచ్చింది. ఇంతలో ఆమె పాపం పండి డెడ్ బాడీకి సంబంధించిన వ్యక్తి తండ్రి దీనా విశ్వకర్మ వచ్చారు. వస్తూనే ఆయన ఆ మృతదేహం తన కొడుకు రిషు (30) దిగా గుర్తించారు. ఆయన తన ఐడీ కార్డు చూపించారు. దీంతో ఆమె అసలు రంగు బట్టబయలైంది. 

దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా, ఆమె భాగోతం బయటపడింది. దీంతో అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా, తన పేరు అలియా పర్విన్ అని, వారణాసిలోని గాడౌలియా ప్రాంతానికి చెందిన మహిళగా తెలిపింది. రైలు ప్రమాద బాధితులకు భారీ మొత్తంలో పరిహారం ఇస్తున్నారని తెలిసి దాని కోసం ఈ నాటకం ఆడినట్టు తెలిపింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఇలాంటి వారిని పట్టుకునేందుకు పథక రచన చేస్తున్నారు.