Archive » News » View Details

  •  

అవినీతికి అవకాశం ఇవ్వద్దు...వనపర్తి జిల్లాకలెక్టర్‌ శ్వేతామహంతి

Posted on 17th October, 2016 | Views : 742
అవినీతికి అవకాశం ఇవ్వద్దు...వనపర్తి జిల్లాకలెక్టర్‌ శ్వేతామహంతి
facebook twitter google plus linkedin pinterest mail


ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అవినీతికి ఆవకాశం లేకుండా క్షేత్రస్దాయికి అందే విధంగా చర్యలు తీసుకుంటానని వనపర్తి జిల్లాకలెక్టర్‌ శ్వేతామహంతి అన్నారు. కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత మొదటిసారిగా వెనుకబడిన తరగతుల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించిన మహార్షి వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆదివారం పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌ హాల్‌లో జరిగిన ఈ వేడుకలకు డిఆర్‌ఓ వనజాదేవి అధ్యక్షత వహించగా జిల్లాకలెక్టర్‌ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో అక్షరాస్యత శాతం తక్కువగా ఉందని అక్షరాస్యతను పెంచేవిధంగా ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలని ఆమె సూచించారు. ఎక్కడైతే అక్షరాస్యత పెరుగుతుందో ఆ ప్రాంతం ఆర్ధికంగా అభివృద్ధి చెందుతుందని ఆమె అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీల వర్గాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఆమె అన్నారు. ఈ వర్గాలకు చెందిన ప్రభుత్వ పథకాలను వారికే అందే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆమె అన్నారు. మధ్యవర్తులను ఆశ్రయించకుండా నేరుగా సంబంధిత అధికారులను సంప్రదించాలని, అక్కడ న్యాయం జరుగగపోతే నేరుగా తమ కార్యాలయానికి రావాలని ఆమె కోరారు. గ్రామీణ విద్యార్ధులు ఉన్నత చదువుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన గురుకుల పాఠశాలలో చదివే విధంగా కృషి చేయాలన్నారు. వాల్మీకిమహార్షి ప్రపంచస్దాయిలో పేరున్న గొప్ప వ్యక్తి అని ఆమె కొనియాడారు. వాల్మీకి వారికి కావాల్సిన స్ధల భవనాల ఏర్పాటుపై దృష్టి పెడుతాన ని జిల్లా కలెక్టర్‌ తెలిపారు.