Archive » Health » View Details

  •  

మోడీ మొబైల్ ప్రియుడు

Posted on 15th September, 2016 | Views : 278
మోడీ మొబైల్ ప్రియుడు
facebook twitter google plus linkedin pinterest mail

మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ టెక్నాలజీ ప్రియుడు అని అందరికీ తెలిసిందే..ఆయన ఏ పనిచేసినా అందులో టెక్నాలజీ ఉందా లేదా అని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు కూడా.. ఒక్కమాటలో చెప్పాలంటే ఆ టెక్నాలజీతోనే ఆయన ప్రధాని కాగలిగారు. ఇది ఎవ్వరూ కాదనలేని వాస్తవం. ఇక ఆయన చేతిలో ఎప్పుడూ ఐ ఫోన్ ఉంటుంది. ఏ దేశానికి వెళ్లినా ఆ దేశాధ్యక్షనితో సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు..మరి ఆయన ఏ యాప్స్ వాడుతున్నారు...ఆయన ఫోన్లో ఎప్పుడూ ఉండే యాప్స్ ఏంటీ అనే విషయాలపై ఓ స్మార్ట్ లుక్కేద్దామా...

పాకెట్ యోగా : 65 సంవత్సరాల నరేంద్రమోడీకి యోగా అంటే ఎంతో ఇష్టం. మోడీ ఏ దేశ పర్యటనకు వెళ్లినా అక్కడ ఈ ప్యాకెట్ యోగాతో కొన్ని రకాల యోగాలు చేస్తారు.ఈ యాప్ అన్ని రకాల ఫ్లాట్ పామ్‌ల మీద ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు,

ఎవర్ నోట్ : ఈ యాప్‌తో ఎన్నికల్లో ఎన్ని సీట్లు వస్తాయనే దాని మీద ప్రయోగాలు చేశారు. ఇది ప్లానింగ్ అలాగే స్ట్రాటజీ, షెడ్యూల్ ఇలా అన్ని రకాలకు సంబంధించిన అంశాలను అందిస్తుంది. ప్రధాని ఎప్పటికప్పుడు తన షెడ్యూల్ వివరాలను ఈ యాప్ లో చూసుకుంటారని తెలుస్తోంది. ఈ యాప్ అన్ని రకాల ఫ్లాట్ పామ్‌ల మీద ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

యాంగ్రీ బర్డ్స్: మోడీ ఎప్పుడైనా అసహనంతో ఉన్నప్పుడు అప్పుడు ఈ ఆటను ఆడుతారని కొంతమంది చెబుతుంటారు. ఆయన ఎప్పుడూ కోపంగా ఉన్నా ఈ ఆటతో మళ్లీ రీ ఫ్రెష్ అవుతారని సన్నిహితులు చెబుతుంటారు.

ఇన్‌స్ట్రాగ్రామ్: మోడీ ఏదైనా దేశ పర్యటనలకు వెళ్లినప్పుడు అక్కడ తనకు ఇష్టమైన సెల్ఫీలు దిగినప్పుడు ఆయన వాటిని వెంటనే ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేస్తారు. ఈ యాప్ కూడా ఆయన ఫోన్లో ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది.

వైబర్ : ఫ్యామిలీతోస్ గానీ అలాగే సన్నిహితులతో గానీ ఫ్యాన్స్‌తో గానీ అందరితో కనెక్ట్ అయ్యేది ఈ యాప్ తోనే. ఇందులో నుంచి కాల్ గానీ మెసేజ్ గానీ అలాగే పిక్ఛర్స్ గానీ షేర్ చేసుకోవచ్చు.ఈ యాప్ కూడా ఆయన ఫోన్లో ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది.

18000 జోక్స్ : మోడీ అప్పుడప్పుడూ జోక్‌లతో కూడా అందర్నీ అలరిస్తుంటారు. అలాగే ఆయన జోకుల్ని చూసి తెగ ఎంజాయ్ చేస్తుంటారు. అందుకే ఆయన ఫోన్లో ఎప్పుడూ ఈ యాప్ ఉంటుంది.

ఒపెరా మినీ : మీడియా ఇంటర్యూలు, అలాగే ప్రెస్ కాన్పరెన్స్‌లు అలాగే పార్టీ మీటింగ్‌లు వీటన్నింటి గురించి మోడీ ఒపెరాలో కనెక్ట్ అవుతారు. ఈ యాప్ నెట్ తక్కువ ఉన్న ఏరియాల్లో కూడా ఈ బ్రౌజర్ బాగా పనిచేస్తుంది. ఇంకా చెప్పాలంటే ఒ ఫర్ ఒపెరా..దాన్ని నరేంద్రమోడీ వాడుతున్నారు. నమోలో చివరి అక్షరం కూడా ఓ. అందుకే దాన్ని వాడుతున్నారని కొందరంటారు.